LOADING...
Dhurandhar: బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 400 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో!
బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 400 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో!

Dhurandhar: బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 400 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, వాటిని మించిపోయే స్థాయిలో వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా వీక్‌డేస్‌లో వసూళ్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, 'ధురంధర్' మాత్రం అదే జోరును కొనసాగిస్తూ దేశంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది. సాధారణంగా రెండో సోమవారం సినిమా వసూళ్లలో భారీ తగ్గుదల కనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఆ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసింది. రెండో సోమవారం రోజునే ఏకంగా రూ.31.80 కోట్లు వసూలు చేసి, ఇప్పటివరకు లేని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయి.

Details

కథానాయికగా సారా అర్జున్

తాజా లెక్కల ప్రకారం, 11 రోజుల్లోనే రూ.396 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన 'ధురంధర్', ఇప్పుడు రూ.400 కోట్ల మార్క్‌ను తాకే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వేగం కొనసాగితే, త్వరలోనే మరిన్ని మైలురాళ్లు దాటడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈచిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించగా, కథానాయికగా సారా అర్జున్ నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. బలమైన కథ, శక్తివంతమైన నటన, గ్రాండ్ మేకింగ్ కలిసి 'ధురంధర్'ను బాక్సాఫీస్ సెన్సేషన్‌గా మార్చేశాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement