OTT: ఓటీటీలో 'ధురంధర్' ఆల్‌టైమ్ రికార్డు.. నెట్‌ఫ్లిక్స్‌లో తొలి వీకెండ్‌లోనే నంబర్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' విడుదలైన నాటి నుంచి రికార్డుల మోత మోగిస్తోంది. థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటిటి వేదికపై కూడా తన సత్తాను చాటుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తూ, ఇండియన్ సినిమాల సరసన మరో మైలురాయిగా నిలిచింది. ఓటీటీలోనూ ధురంధర్ దూకుడు థియేటర్లలో భారీ విజయం సాధించిన అనంతరం జనవరి 30న 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. విడుదలైన కేవలం ఒక వారంలోనే పలు భారీ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. పోస్ట్-థియేట్రికల్ హిందీ ఓటీటీ రిలీజ్‌లలో ఫస్ట్ వీకెండ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీగా ధురంధర్ కొత్త రికార్డు నెలకొల్పింది.
Details
ఫస్ట్ వీకెండ్‌లో సెన్సేషనల్ వ్యూస్
ఓటీటీలోకి వచ్చిన తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 7.6 మిలియన్ వ్యూస్ రాబట్టి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫస్ట్ వీకెండ్‌లోనే 7 మిలియన్ల వ్యూస్‌ను దాటిన తొలి ఇండియన్ మూవీగా 'ధురంధర్' చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్', హృతిక్ రోషన్ 'ఫైటర్', అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' వంటి భారీ చిత్రాల బెంచ్‌మార్క్‌లను అధిగమించింది. ఇతర సినిమాల వ్యూస్ వివరాలు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' తొలి వీకెండ్‌లో 6.2 మిలియన్ల వ్యూస్ సాధించగా 'ఫైటర్' 5.9 మిలియన్లు, 'పుష్ప 2: ది రూల్' 5.8 మిలియన్ల వ్యూస్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ అన్ని రికార్డులను ధురంధర్ అధిగమించడం విశేషం.
Details
ఫస్ట్ వీకెండ్ వ్యూస్ లిస్ట్
ధురంధర్ - 7.6 మిలియన్ (3 రోజులు) యానిమల్ - 6.2 మిలియన్ (3 రోజులు) ఫైటర్ - 5.9 మిలియన్ (3 రోజులు) పుష్ప 2: ది రూల్ - 5.8 మిలియన్ (3 రోజులు) రైడ్ 2 - 5.6 మిలియన్ (3 రోజులు) క్రూ - 5.4 మిలియన్ (3 రోజులు) జవాన్ - 5.2 మిలియన్ (3 రోజులు) ఇడ్లీ కడై - 5.2 మిలియన్ (5 రోజులు) లక్కీ భాస్కర్ - 5.1 మిలియన్ (3 రోజులు) సికందర్ - 5.1 మిలియన్ (5 రోజులు)
Details
ధురంధర్ కథా విశేషాలు
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ భారత గూఢచారి పాత్రలో నటించాడు. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతమొందించేందుకు పాకిస్థాన్‌లోని లైయారీ ముఠాల్లోకి చొరబడే ఏజెంట్ కథగా సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించగా సారా అర్జున్, రాకేష్ బేడీ సహాయ పాత్రల్లో కనిపించారు.
Details
బాక్సాఫీస్ వద్ద చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్‌లో రూ.1000 కోట్ల మార్క్‌ను దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా 'ధురంధర్' చరిత్ర సృష్టించింది. సీక్వెల్‌పై అంచనాలు ఈ ఘన విజయం తర్వాత అభిమానులు ఇప్పటికే సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.