LOADING...
Kantara Chapter 1:  యాక్షన్ సన్నివేశంలో డూప్‌ లేకుండా రిషబ్..  హీరోపై స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ ప్రశంసలు 
యాక్షన్ సన్నివేశంలో డూప్‌ లేకుండా రిషబ్.. హీరోపై స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ ప్రశంసలు

Kantara Chapter 1:  యాక్షన్ సన్నివేశంలో డూప్‌ లేకుండా రిషబ్..  హీరోపై స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ ప్రశంసలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2022లో విడుదలై హిట్‌లలో నిలిచిన 'కాంతార'కి ఇది ప్రీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా. రిషబ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న అర్జున్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను రిషబ్‌ స్వయంగా చేశారని తెలిపారు.

వివరాలు 

హీరో రిషబ్‌పై ప్రశంసలు కురిపించిన అర్జున్‌ రాజ్‌

"ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్‌ ఉపయోగించలేదు. రిషబ్ రిస్క్ తీసుకుని ఎన్నో స్టంట్స్ చేశాడు. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని యాక్షన్ సన్నివేశాలను కూడా డూప్ లేకుండా చేశాడు. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల యుద్ధం, అలాగే ప్రాచుర్యం పొందిన కలరిపయట్టు యుద్ధ కళలో శిక్షణ పొందారు. నేను ఇప్పటివరకు చాలా నటులతో పని చేసాను, కానీ రిషబ్ లాంటి హీరోను చూడలేదు. 'నేను నా శక్తుల వరకు ప్రయత్నిస్తాను, బ్రతికేంతవరకు చేస్తాను' అని చెబుతాడు. అంటూ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ అర్జున్‌ రాజ్‌ హీరో రిషబ్‌పై ప్రశంసలు కురిపించారు.

వివరాలు 

మొదటి 'కాంతార' సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ 

మొదటి 'కాంతార' సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి,రూ. 400 కోట్లు పైగా వసూళ్లను సాధించడం విశేషం. మొదటి భాగంలో కథ ఎక్కడి నుంచి ప్రారంభమైందో, దానికి ముందు జరిగిన సంఘటనలను 'కాంతార చాప్టర్ 1'లో ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా పంజుర్లకు సంబంధించిన సన్నివేశాలు ఈ ప్రీక్వెల్‌లో ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మొదట కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన 'కాంతార' తర్వాత, ఇతర భాషల్లో డబ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'కాంతార 2'ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.