పూరీని ఇంకా వీడని 'లైగర్' కష్టాలు.. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్ల ధర్నా
లైగర్ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ కు 'లైగర్' కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యి ఏడాది అవుతున్నా పూరీని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఇంకా ఎగ్జిబీటర్ల రూపంలో వెంటాడుతూనే ఉంది. లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్న పూరీజగన్నాథ్ నష్టాలను భరించేందుకు ముందుకొచ్చారు. అయితే ఇచ్చిన హామీని పూరీ నెరవేర్చలేదు. లైగర్ చిత్రాన్ని ప్రదర్శించి తాము నష్టపోయామని నైజాంకు చెందిన ఎగ్జిబీటర్లు శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద ధర్నాకు దిగారు. పూరీ మాట ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు.
పూరీ జగన్మాథ్ మోసం చేశాడని ఆరోపణలు
లైగర్ సినిమాతో అప్పుల్లో మునిగిపోయామని, తమకు రూ.9 కోట్లు తిరిగి ఇస్తానని పూరీ హామీ ఇచ్చారని, కానీ ఆరు నెలలవుతున్న ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదని లీజర్లు ఆరోపించారు. పూరీ జగన్మాథ్ తమ ఫోన్ కాల్స్ కూడా సమాధానం ఇవ్వడం లేదని వారు వాపోయారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై పూరీ జగన్మాథ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం పూరీ జగన్మాథ్ తన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను మే 15న ప్రకటించే అవకాశం ఉంది.