Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్ రాజు రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. 2003లో వచ్చిన 'దిల్' సినిమా విజయంతో నిర్మాతగా నిలిచిన ఆయన, అదే పేరుతో గుర్తింపునూ సంపాదించుకున్నారు.