గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు
ఈ మధ్య హీరోయిన్లకు గుడి కట్టించడం అనే టాపిక్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో బాపట్లకు చెందిన ఒక అభిమాని, హీరోయిన్ సమంతకు గుడి కట్టించడంతో ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. రీసెంట్ గా రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతికి గుడి కట్టిస్తానంటూ ఒక అభిమాని ముందుకు వచ్చాడు. రామబాణం ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటున్న డింపుల్ హయాతిని ప్రశ్నించిన ఒక అభిమాని, మీకు గుడి కట్టించాలని అనుకుంటున్నానని, పాలరాతితో కడితే మంచిదా? లేక ఇటుకతో మంచిదా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా, బంగారంతో కట్టి చూపించు అని కౌంటర్ ఇచ్చింది డింపుల్ హయాతి.
మే 5వ తేదీన థియేటర్లలోకి వస్తున్న రామబాణం
బంగారంతో కట్టమని కౌంటర్ ఇవ్వడంతో ప్రెస్ మీట్ లో ఉన్నవారందరూ నవ్వేసారు. ఇదిలా ఉంటే, మే 5వ తేదీన రామబాణం సినిమా థియేటర్లలోకి వస్తోంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేసారు. గతంలో గోపీచంద్ నటించిన లక్ష్యం, లౌక్యం సినిమాలకు దర్శకత్వం వహించింది శ్రీవాసే కావడం విశేషం. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన రామబాణం సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మరి సినిమాకు కూడా ఇలాంటి స్పందనే వచ్చి మంచి హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన రామబాణం సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ సుందర్, నాజర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి