
puri jaganath: 'ఖైదీ' రిలీజ్ రోజున పూరి జగన్నాథ్ గీసిన చిరు చిత్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు వరుస విజయ చిత్రాలతో బాక్సాఫీస్‌లో తన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఇటీవల కొద్దిగా నెమ్మదించినా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాక, సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలు, ఆలోచనలను పంచుకునే అంశాల్లో కూడా నిమగ్నమై ఉంటారు. "పూరి మ్యూజింగ్స్" పేరుతో వివిధ విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
వివరాలు
60/40 ఫోటో దొరికింది
"పాత డైరీ దొరికింది. 'ఖైదీ' సినిమా రిలీజ్ రోజున ఒక అభిమాని తన స్వహస్తాలతో చిరంజీవి గారి చిత్రాన్ని గీసి, థియేటర్ సమీపంలో ఫోటో కార్డ్ డిస్ప్లేలో పెట్టిన 60/40 ఫోటో దొరికింది. ఆ అభిమానిపేరు పూరి జగన్నాథ్" అని పేర్కొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది చిరంజీవి అంటే పూరికి ఎంతో అభిమానం ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో సినిమాలు తీసిన పూరి చిరు (Chiranjeevi) చిత్రానికి దర్శకత్వం వహించలేకపోయారు. చిరంజీవి రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత సినిమాల్లో నటించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు,పూరి అతనికి కథ వినిపించారు.
వివరాలు
'మన శంకర వరప్రసాద్' సెట్‌లో పూరి జగన్నాథ్, ఛార్మి
"ఆటో జానీ"అనే మాస్ కథను రూపొందించగా,, ఎంచేతనో అది కార్యరూపం దాల్చలేదు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్' సెట్‌లో పూరి జగన్నాథ్, ఛార్మి వెళ్లారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా, టబు కీలక పాత్రలో పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చిరంజీవిని మర్యాదగా కలిసింది. చిరంజీవి వారి సినిమా సాధించాలని ఆకాంక్షించారు.