LOADING...
PEDDI : మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

PEDDI : మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల తేదీపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 30న రిలీజ్ వాయిదా పడిందనే ప్రచారంపై రామ్ చరణ్ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు.

వివరాలు

వేసవి తర్వాతే సినిమా?

అయితే తాజా పరిస్థితులను చూస్తే 'పెద్ది' విడుదల వాయిదా పడటం ఖాయం అనిపిస్తోంది. ఇంకా రెండు పాటల షూటింగ్ పూర్తి కావాల్సి ఉండటం, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. అలాగే ఏఆర్ రెహమాన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మరింత సమయం అవసరం కావడం వంటి కారణాలతో మేకర్స్ రిలీజ్‌ను ముందుకు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను వేసవి కాలం తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

వివరాలు

జూన్‌లో రిలీజ్ చేసే అవకాశం

కొత్త విడుదల తేదీలుగా జూన్ 4 లేదా జూన్ 25లను పరిశీలిస్తున్నారని టాక్. ఈ రెండింటిలో ఒక తేదీని త్వరలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

Advertisement