Aadhi Pinisetty: నిక్కీతో విడాకులు? అసలు నిజం ఇదే: స్పందించిన ఆది పినిశెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి 'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వైవాహిక జీవితం, కెరీర్ గురించి మాట్లాడారు.
నిక్కీ గల్రానీతో విడాకులపై వస్తున్న వార్తలపై మాట్లాడారు. అలాంటి వార్తలు చూసి బాధపడ్డానని, అవి రాసే వారిపై కోపం వచ్చిందని తెలిపారు.
Details
నిక్కీతో విడాకుల వార్తలపై స్పందించిన ఆది
నిక్కీ తనకు మంచి స్నేహితురాలని, తన కుటుంబానికి కూడా ఆమె ఎంతో చేరువైందన్నారు.
కుటుంబ సభ్యులకు నచ్చడంతో పెద్దల అంగీకారంతోనే తాము పెళ్లి చేసుకున్నామని చెప్పారు.
తామిద్దరం విడిపోతున్నామని యూట్యూబ్‌లో కథనాలు రావడంతో షాకయ్యాయని తెలిపారు.
మొదట కోపం వచ్చిందని, కానీ ఆ తర్వాత అలాంటి ఫేక్ వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనిపించిందన్నారు.
Details
తన కెరీర్ గురించి మాట్లాడిన ఆది పినిశెట్టి
ఇక 'రంగస్థలం' తనకు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చింది. అదే సినిమా ఇప్పుడు విడుదలైతే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేదన్నారు.
ఆ సినిమాలో తాను చనిపోయే సన్నివేశం చేస్తున్నప్పుడు, తన చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి నిజంగా భయపడ్డానని, మనిషి చనిపోతే ఇలా ఉంటుందా? అనిపించిందన్నారు.
థియేటర్‌లో ఆ సీన్ చూసిన తన నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు.
ఫిబ్రవరి 28న 'శబ్దం' విడుదల
ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'శబ్దం' సినిమాకు అరివళగన్ దర్శకత్వం వహించారు. 'వైశాలి' విజయం తర్వాత వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది.