LOADING...
Deepavali Special: పాత సినిమాల్లో దీపావళి జ్ఞాపకాలు… తెలుగు సినిమాల అలనాటి విశేషాలివే! 
పాత సినిమాల్లో దీపావళి జ్ఞాపకాలు… తెలుగు సినిమాల అలనాటి విశేషాలివే!

Deepavali Special: పాత సినిమాల్లో దీపావళి జ్ఞాపకాలు… తెలుగు సినిమాల అలనాటి విశేషాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి (Deepavali) పండుగకు తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. 'దీపావళి' పేరుతో వచ్చిన తొలి సినిమా 1960లో విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో ఆకట్టుకోగా, సావిత్రి సత్యభామ పాత్రలో మెప్పించారు. కృష్ణకుమారి రుక్మిణిగా నటించి అందరిని అలరించారు. దీపావళి ప్రాధాన్యతను, పౌరాణిక ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా తెరకెక్కింది.

Details

ఆత్రేయ కలం నుంచి వచ్చిన చిరస్మరణీయ గీతం 

1972లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన విచిత్ర బంధం సినిమాలోని పాట 'చీకటి వెలుగుల రంగేలీ... జీవితమే ఒక దీపావళి' ప్రతి దీపావళి పండుగకు ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. ఆత్రేయ సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం, ఘంటసాల-పీ. సుశీల గాత్రంతో ఈ పాట శాశ్వతంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం 1972 అక్టోబర్ 12న విడుదలైంది.

Details

1960లో విడుదలైన తొలి దీపావళి సినిమా 

దీపావళి పేరుతో వచ్చిన తొలి తెలుగు చిత్రం 1960లో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, కృష్ణుడిగా సావిత్రి సత్యభామగా, కృష్ణకుమారి రుక్మిణిగా, ఎస్‌.వి. రంగారావు సరకాసురుడిగా కనిపించారు. పౌరాణిక నేపథ్యంతో దీపావళి పండుగ ఆదిమ చరిత్రను ఈ చిత్రం బలంగా చూపించింది. 2008లో వచ్చిన మరో 'దీపావళి' సినిమా 2008లో మరోసారి 'దీపావళి' అనే టైటిల్‌తో సినిమా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎ.ఎ.ఎ క్రియేషన్స్ బ్యానర్‌పై తీగల కృష్ణారెడ్డి నిర్మించగా, హరిబాబు దర్శకత్వం వహించారు. ఇందులో: వేణు, ఆర్తీ అగర్వాల్, మేఘా నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు. అలీ, అనంత్, భానుచందర్, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, బ్రహ్మాజీ హాస్యంతో, యాక్షన్‌తో వినోదాన్ని పంచారు.