Loading...
Nagarjuna: 'రిలీజ్ డేట్ ప్రకటిస్తే మార్చొద్దు'.. చిత్ర పరిశ్రమకు నాగార్జున కీలక సూచన
'రిలీజ్ డేట్ ప్రకటిస్తే మార్చొద్దు'.. చిత్ర పరిశ్రమకు నాగార్జున కీలక సూచన

Nagarjuna: 'రిలీజ్ డేట్ ప్రకటిస్తే మార్చొద్దు'.. చిత్ర పరిశ్రమకు నాగార్జున కీలక సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాల విడుదల తేదీల విషయంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ చిత్రాల మాదిరిగా ముందుగానే విడుదల తేదీని ప్రకటించి, అదే తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హాలీవుడ్ చిత్రం 'ది ఒడిస్సీ' ఉదాహరణగా ప్రస్తావించిన నాగార్జున.. 'ఆ సినిమాకు ఏడాది ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించారు. చెప్పిన తేదీకే సినిమాను విడుదల కూడా చేశారని తెలిపారు. అయితే మన దగ్గర మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. 'మనం రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ, ఆ సమయానికి సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. 'లెనిన్' సినిమా విషయంలో కూడా విడుదల తేదీలను మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వివరాలు

మార్పుల గురించి ప్రస్తావిస్తాం

అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాణ ప్రక్రియలో వస్తున్న మార్పుల గురించి కూడా నాగార్జున మాట్లాడారు.

'గతంలో విడుదలకు నెల రోజుల ముందే సినిమా ఫైనల్ కాపీని చూసేవాళ్లం. ఇప్పుడు మాత్రం అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు.

చివరగా ప్రకటించిన రిలీజ్ డేట్‌కే ప్రతి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఎంతో బాగుంటుందంటూ చిత్ర పరిశ్రమలో విడుదల తేదీల విషయంలో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ అవసరమని నాగార్జున అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT