ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఖర్చు తెలుసా? క్రాకర్స్ కోసమే 50లక్షలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఏ రేంజ్ లో ఉన్నాయో నిన్న జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలియజేసింది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లక్షకు పైగా అభిమానులు తరలిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతమంది అభిమానుల మధ్య ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంటుకు ఎంత ఖర్చు అయ్యిందనేది చర్చనీయాంశంగా మారింది. 50అడుగుల పొడవైన ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్, అయోద్య సెట్, వెలుగులు జిమ్మిన క్రాకర్స్.. వీటన్నింటికీ మొత్తం ఖర్చు 2.5కోట్లు అయ్యిందని అంటున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ ఈవెంట్లో పేలిన క్రాకర్స్ ఖర్చు 50లక్షలను ప్రచారం జరుగుతోంది. మిగతాదంతా 2కోట్ల వరకు అయ్యిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. ఈ ఈవెంట్లో జరిగిన కార్యక్రమాలను దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ కార్యక్రమాలను దర్శకుడు అతనే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఆదిపురుష్ పై అంచనాలు మరింత పెరిగాయి. రిలీజైన ఫైనల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 16న విడుదల అవుతుంది.