Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో 18 మంది హీరోలు.. ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "గేమ్ చేంజర్".
అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.
మొదటి ఆట నుంచే ఈ సినిమా మంచి స్పందన పొందింది, దీని వల్ల ఈ సినిమా గురించి అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన హీరోగా నటించినా, ఇతర పాత్రలలో కూడా అనేక హీరోలు కనిపించారు.
రామ్ చరణ్ తమ్ముడి పాత్రలో విశ్వంత్ నటించగా,విశ్వంత్ గతంలో "కేరింత" సినిమాలో హీరోగా నటించారు.
వివరాలు
సూర్య సోదరుడి పాత్రలో మలయాళ హీరో జయరాం
అలాగే,ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటించగా,ఆయన గతంలో "న్యూ" సినిమాలో హీరోగా కనిపించారు. సూర్య అనుచరుడిగా నవీన్ చంద్ర నటించారు.
ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ నటించారు. శ్రీకాంత్,గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు.
దర్శకుడిగా పేరొందిన సముద్రఖని, ఇందులో శ్రీకాంత్ అనుచరుడిగా నటించారు.
సీనియర్ నరేష్, రామ్ చరణ్ పెంపుడు తండ్రి పాత్రలో నటించారు. నరేష్,చాలా సినిమాల్లో హీరోగా నటించారు.
మలయాళ హీరో జయరాం, ఈ సినిమాలో సూర్య సోదరుడి పాత్రలో కనిపించారు. "బలగం" సినిమా హీరో ప్రియదర్శి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా కనిపించారు.
గతంలో కమెడియన్ గా పరిచయమైన, తరువాత హీరోగా మారిన సునీల్,ఈ సినిమాలో రామ్ చరణ్ బంట్రోతు పాత్రలో నటించారు.
వివరాలు
ఈ సినిమాలో 17 మంది హీరోలు
"వినాయకుడు" సినిమా హీరో కృష్ణుడు, "మ్యూజిక్ షాప్" మూర్తి అనే హీరోలు కూడా క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మాన్లుగా కనిపించారు.
"సుందరం మాస్టర్" సినిమాతో హీరోగా పరిచయమైన వైవా హర్ష, "అనగనగా ఓ అతిధి" హీరో చైతన్య కృష్ణ కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితులుగా కనిపించారు.
"వివాహ భోజనంబు" సినిమాతో హీరోగా పరిచయమైన కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వి వంటి కమెడియన్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.
ఇలా చూస్తే, రామ్ చరణ్ కాకుండా ఈ సినిమాలో 17 మంది హీరోలు నటించారన్న మాట.