LOADING...
Ram Gopal Varma: 'శివ' సినిమాలోని చిన్నారి సుష్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఫొటో షేర్‌ చేసిన ఆర్జీవీ!
'శివ' సినిమాలోని చిన్నారి సుష్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఫొటో షేర్‌ చేసిన ఆర్జీవీ!

Ram Gopal Varma: 'శివ' సినిమాలోని చిన్నారి సుష్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఫొటో షేర్‌ చేసిన ఆర్జీవీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన కల్ట్‌ క్లాసిక్‌ చిత్రం 'శివ' (Shiva)లోని ప్రసిద్ధ సైకిల్‌ ఛేజ్‌ సీక్వెన్స్‌ గుర్తుందా? అందులో నటించిన చిన్నారి 'సుష్మ' ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియజేస్తూ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం సుష్మ యునైటెడ్ స్టేట్స్‌లో ఏఐ (Artificial Intelligence), కాగ్నిటివ్‌ సైన్స్‌ రంగాలలో పరిశోధన చేస్తున్నారని తెలిపారు. వర్మ ఆమెను ఉద్దేశించి, "సుష్మ.. నువ్వు అప్పుడు ఆ సైకిల్‌ ఛేజ్‌లో చేసిన సాహస సన్నివేశాలు నిజంగా అద్భుతం. కానీ, ఆ సన్నివేశం ఎంత రిస్కీగా ఉందో, నువ్వు ఎంత భయపడ్డావో ఓ దర్శకుడిగా అప్పుడు నేను అర్థం చేసుకోలేదు.

Details

క్షమాపణ కోరుతున్నా

ఇప్పుడు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించని రాశారు. 'శివ' సినిమాలో హీరో అన్నయ్య కూతురి పాత్రలో సుష్మ నటించింది. ఆ చిన్నారిని కథానాయకుడు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విలన్‌ గ్యాంగ్‌ వెంబడించే సన్నివేశం ఈ సినిమాలో క్లైమాక్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఆ సీక్వెన్స్‌ను ఎలాంటి డూప్‌ లేకుండా తానే చేశానని ఇటీవల నాగార్జున (Nagarjuna) వెల్లడించారు. ఆర్జీవీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ తరానికి ఆ మైజిక్‌ను మరోసారి చూపించేందుకు ఈనెల 14న 'శివ' రీ-రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా వర్మ తన భావోద్వేగ పోస్టుతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు.