Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదలైన ఈ సినిమా పూర్తిస్థాయి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా, బాగుంది అన్న పాజిటివ్ స్పందన మాత్రం వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. ఆయన మేనరిజమ్స్, డ్యాన్సులు, ఫైట్స్‌కు థియేటర్లలో విశేష స్పందన లభిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అయితే రాశీ ఖన్నాతో పోలిస్తే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. 'లీల' అనే రేడియో జాకీ పాత్రలో ఆమె తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
వివరాలు
మొదటగా పూజా హెగ్డే ఎంపిక
ముఖ్యంగా సెకండాఫ్ కథ మొత్తం ఆమె చుట్టూ తిరగడం ఈ పాత్రను మరింత బలంగా నిలబెట్టింది. పవన్-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీరి మధ్య వచ్చే 'ఈ మనసే' పాట రీమిక్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా నిలిచింది. గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో శ్రీలీలకు ఎక్కువ స్క్రీన్ స్పేస్, మంచి నటనకు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదటిగా శ్రీలీలను కాకుండా పూజా హెగ్డేను ఎంపిక చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావించారట.
వివరాలు
చివరికి శ్రీలీలకు అవకాశం
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన డీజే విజయవంతం కావడంతో మళ్లీ ఆమెకే అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. కానీ పూజా హెగ్డే అప్పట్లో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో ఆ అవకాశం శ్రీలీలకు దక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి మైలేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దక్షిణాది సినిమాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.