LOADING...
Raghav Chadda: రాఘవ్ చద్దా భార్య ఎవరో తెలుసా? బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమెనే!
రాఘవ్ చద్దా భార్య ఎవరో తెలుసా? బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమెనే!

Raghav Chadda: రాఘవ్ చద్దా భార్య ఎవరో తెలుసా? బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమెనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఘవ్ చద్దా రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన పార్టీ మారినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్ నాయకుడిగా, రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. పార్లమెంట్‌లో గిగ్ వర్కర్ల సమస్యలు, ఎయిర్‌పోర్టుల్లో ధరల పెరుగుదల, యువత అంశాలపై ఆయన గళం వినిపించేవారు. ఒకసారి బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసి కూడా దృష్టిని ఆకర్షించారు. అయితే తాజా పరిణామాల్లో ఆయన పార్టీ మారిన తర్వాత సోషల్ మీడియాలో 'అన్‌ఫాలో రాఘవ్ చద్దా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య 14.6మిలియన్ల నుంచి 13.5మిలియన్లకు తగ్గినట్లు చెబుతున్నారు.

వివరాలు

బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు

ఈ పరిణామం నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆమె బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 'ఇషాక్జాదే' సినిమాకు ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పరిణీతి చోప్రా, ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి కూడా. 2023లో ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత పరిణీతి సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, బాలీవుడ్‌లో ఆమెకున్న క్రేజ్ ఇంకా కొనసాగుతోంది.

Advertisement