LOADING...
Mirai : 'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?
'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?

Mirai : 'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా 'మిరాయ్' సెప్టెంబర్ 12న విడుదలై, ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. కేవలం 5 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల మరియు ట్రేడ్ వర్గాలనూ గెలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్‌లో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా మరో పవర్ ఫుల్ రోల్‌లో కనిపించింది. హీరోలతో పాటు ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు కూడా నటించారు. శైలజ, చిత్రల హరి వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన కిశోర్ తిరుమల, కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా మిరాయ్‌లో కనిపించారు.

Details

టాలీవుడ్ డైరక్టర్ గా గుర్తింపు

వీరిద్దరిలో ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్, మరొకరు అతని బాస్‌గా స్క్రీన్ మీద దర్సించబడ్డారు. ముఖ్యంగా సీఐ అశోక్ పాత్రలో కిశోర్ తిరుమల కామెడీ టైమింగ్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. కిశోర్ తిరుమల డైరెక్టర్ మాత్రమే కాదు, యాక్టింగ్ ట్యాలెంట్ కూడా ఉందని చెప్పొచ్చు. ఆయన సెకెండ్ హ్యాండ్, పవర్, కరెంట్ తీగ, రఘు వరన్ బీటెక్, శివమ్ వంటి సినిమాలకు మాటలు, పాటలు రాశాడు. ఇక, శైలజా సినిమాతో డైరెక్టర్‌గా మారి, మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత ఒకటే జిందగీ, చిత్రల హరి, రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు.