Rishab Shetty : దైవ అంశాలతో ఆటలు వద్దు.. 'కాంతార'పై రక్షిత్ శెట్టి స్పష్టీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి చేసిన నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ సినిమా వేడుకలో ఆ చిత్రంలోని పంజూర్లీ దేవత పాత్రను ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రణ్‌వీర్ చేసిన ఈ అనుకరణపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. విషయం పెద్దదవ్వడంతో రణ్‌వీర్ సింగ్ ఈ వ్యవహారంపై బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదంపై తాజాగా స్వయంగా స్పందించిన రిషభ్ శెట్టి, ఆ సంఘటన తనను కొంత ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు. సినిమా వేడుకలో 'కాంతార'లోని కీలక సన్నివేశాన్ని రణ్‌వీర్ ఇమిటేట్ చేయడం తనకు బాధ కలిగించిందని స్పష్టం చేశారు.
Details
దైవ అంశాలు అత్యంత సున్నితమైనవి
'కాంతారలాంటి సినిమా తీయడం కొంతవరకు రిస్క్‌తో కూడుకున్న పని. ఈ చిత్రంలో మేము దైవిక అంశాలను జోడించాం. సినిమాలో చాలా భాగం నటన, సినిమాటిక్ అంశాలతో సాగినా, దైవ అంశం మాత్రం అత్యంత సున్నితమైనది, పవిత్రమైనది. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా 'కాంతార'లోని భూత కోల(దైవ నృత్యం)ను వేదికలపై ప్రదర్శించవద్దని, ఎగతాళి చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తూ ఉంటానని రిషభ్ శెట్టి అన్నారు. ఆ దైవ నృత్యం తమకు భావోద్వేగంగా ఎంతో లోతుగా ముడిపడి ఉందని, అందుకే రణ్‌వీర్ అలా అనుకరించడం చూసి కొంత బాధ కలిగిందని ఆయన వివరించారు. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నానని, వివాదాన్ని మరింత పెంచే ఉద్దేశం లేదని కూడా రిషభ్ శెట్టి స్పష్టం చేశారు.