LOADING...
Rakul Preet Singh: వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!
వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!

Rakul Preet Singh: వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. ఒక దశలో బంధుప్రీతి (నెపోటిజం)పై చర్చలు సాగితే, ఇటీవల వర్కింగ్ అవర్స్‌పై పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. ఇప్పుడు తాజాగా పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యవస్థపై బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. హిందీ చిత్ర పరిశ్రమలో పీఆర్ వ్యూహాలు హద్దులు దాటుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పబ్లిసిటీ సంస్కృతిపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. 'పీఆర్ వ్యవస్థలు ఒక స్థాయి వరకే పని చేస్తాయి. చివరికి మనం ఎంత కష్టపడి పని చేశామన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.

Details

నెగెటివిటీని సృష్టించే వాళ్లకి నిద్ర ఎలా వస్తుంది

గతంతో పోలిస్తే ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. డబ్బులు ఇచ్చి ఇతరులపై బురద చల్లే పరిస్థితి ఏర్పడింది. ఇంత నెగెటివిటీని సృష్టించే వాళ్లకు నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కాదు. వాళ్లకు మనస్సాక్షి ఉండదా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లు ఎప్పటికైనా తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను నా శ్రమతోనే ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. నాకు పీఆర్ అవసరం లేదని రకుల్ స్పష్టంగా వ్యాఖ్యానించారు.

Details

ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై అసహన వ్యక్తం

ఇదే ఇంటర్వ్యూలో ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను ఒకే జీన్స్‌ను నెలలో ఐదు సార్లు వేసుకుంటానని చెప్పిన రకుల్, ఈ విషయాన్ని కూడా ఫొటోగ్రాఫర్లు గమనిస్తూ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. వారికి ఒక హద్దు ఉండాలని సూచించారు. తాను దుస్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనని, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.

Advertisement