
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించగానే ఓ ప్రభంజనంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపై తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్ర తొలి భాగాన్ని ఈ నెల 12న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు పూర్తి చేశారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అపారమైన స్పందన లభిస్తోంది. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాల్లో ఉన్నారు. ఇక పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ జూన్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు.
Details
పవన్ ఫ్యాన్స్ కు జీవితాంతం గుర్తిండిపోతుంది
ఇదిలా ఉంటే, పవన్ నటిస్తున్న మరో భారీ చిత్రం 'ఓజీ' షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' పట్టాలెక్కనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మూడుసార్లు మూడు చిత్రాలు ఒకేసారి లైన్‌లో ఉండడం ఇదే మొదటిసారి.
ఈ వరుస చిత్రాల అనౌన్స్‌మెంట్‌తో పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అభిమానుల ఆశలకు తగ్గట్టుగా ప్రతీ చిత్రంలోనూ పవన్ ప్రత్యేకత చూపించనున్నారని అంచనాలు పెరిగాయి.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుంచుకునే సినిమాగా ఉంటుందని పేర్కొన్నారు.