
NTR : డ్రాగన్ ఓటీటీ రీలీజ్ కొత్త అప్‌డేట్.. అభిమానుల్లో వీపరితమైన క్రేజ్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'డ్రాగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ ద్వారా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో కలిసి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజీ ఎక్సైట్‌మెంట్ రేకెత్తుతోంది. తాజాగా ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్‌లో అభిమానుల్ని షాక్ చేశాడు. లీన్ బాడీ, పుల్ గడ్డం స్టైల్‌లో ఆయన లుక్ చూపించగా, ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Details
ఓటీటీలో రిలీజ్ కోసం ప్రత్యేక అగ్రిమెంట్
షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. OTT విషయానికొస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో OTT డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, 'డ్రాగన్' టీం ఓటీటీ రీలీజ్ కోసం ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా 8 వారాల తర్వాతే OTT ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో టీం అగ్రిమెంట్ కూడా రాయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ లుక్, OTT రిలీజ్ ప్లాన్ కలిపి 'డ్రాగన్' కోసం అభిమానుల్లో క్రేజీ ఎక్సైట్‌మెంట్‌ను మరింత పెంచాయి.