Page Loader
Drishyam 3: సినీ అభిమానులకు మోహన్‌లాల్‌ శుభవార్త.. 'దృశ్యం3' రెడీ..
సినీ అభిమానులకు మోహన్‌లాల్‌ శుభవార్త.. 'దృశ్యం3' రెడీ..

Drishyam 3: సినీ అభిమానులకు మోహన్‌లాల్‌ శుభవార్త.. 'దృశ్యం3' రెడీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రశ్రేణి నటుడు మోహన్‌లాల్‌ తన అభిమానులకు శుభవార్తను అందించారు. ఆయన అధికారికంగా ప్రకటించిన ప్రకారం,'దృశ్యం 3' (Drishyam 3)త్వరలో రాబోతోంది. జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'దృశ్యం' 2013లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, అనేక భాషల్లో రీమేక్‌ అవ్వడంతో అన్ని చోట్లా విపరీతమైన స్పందన లభించింది. ఈ విజయానికి కొనసాగింపుగా వచ్చిన 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మళ్లీ మంత్రముగ్ధులను చేసింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనప్పటికీ భాషతో సంబంధం లేకుండా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మోహన్‌లాల్‌ అసాధారణమైన నటన, జీతూ జోసెఫ్‌ టేకింగ్, ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వివరాలు 

'దృశ్యం 3' చిత్రం స్క్రిప్ట్‌ సిద్ధం 

ఇప్పుడు ఈ కథను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మూడో భాగం రాబోతోందని చాలా సందర్భాల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ వెల్లడించారు. 'దృశ్యం 3' చిత్రం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ సిద్ధమైందని సమాచారం. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. 'దృశ్యం 3' త్వరలో రాబోతోంది" అంటూ ప్రకటించారు. అలాగే, దర్శకుడు జీతూ జోసెఫ్‌, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌లతో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోహన్ లాల చేసిన ట్వీట్