LOADING...
Peddi : రెండేళ్ల కష్టానికి ఫలితం 'పెద్ది'.. రామ్‌చరణ్‌‌ని ఇంటర్య్యూ చేసిన బుచ్చిబాబు

Peddi : రెండేళ్ల కష్టానికి ఫలితం 'పెద్ది'.. రామ్‌చరణ్‌‌ని ఇంటర్య్యూ చేసిన బుచ్చిబాబు

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, "ప్రతి వ్యక్తి జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటాడు. అలాంటి గుర్తింపు కోసం పోరాడే మనిషి కథనే 'పెద్ది'లో చూపిస్తున్నాం. కొన్ని కథలు రూపొందడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 'మగధీర', 'రంగస్థలం', 'ఆర్‌ఆర్‌ఆర్‌'లాంటి చిత్రాలు అప్పుడప్పుడే వస్తాయి. మంచి సినిమా చేయడం అంత సులభం కాదు. నా సినీ ప్రయాణంలో 'పెద్ది' కూడా అలాంటి ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది" అని చెప్పారు.

వివరాలు

ఐదేళ్లుగా ఆ కథతోనే..

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, వెంకట సతీశ్‌ కిలారు, ఇషాన్‌ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా గురించి మరింతగా చెబుతూ రామ్‌చరణ్‌, "గత రెండేళ్లుగా 'పెద్ది' కోసం మేమంతా ఎంతో అంకితభావంతో పనిచేశాం. ఈ కథ మా ఆలోచనల్లో, మా జీవితాల్లో పూర్తిగా కలిసిపోయింది. 'పెద్ది' మా శ్వాసలా మారిపోయింది. దర్శకుడు బుచ్చిబాబు అయితే గత ఐదేళ్లుగా ఈ కథతోనే జీవిస్తున్నారు. మాకన్నా ఎక్కువ శ్రమ ఆయన పెట్టారు.

వివరాలు

అద్భుతంగా స్టెప్స్ వేసిన జాన్వీ..

ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ ప్రధాన బలంగా నిలిచారు. నటుడు దివ్యేందు శర్మ తెలుగు డైలాగ్స్‌ ప్రత్యేకంగా నేర్చుకుని చెప్పడం విశేషం. జాన్వీ కపూర్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్‌ అద్భుతంగా చేసింది. సుమారు 85 రోజుల పాటు షూటింగ్‌ నిర్వహించాం. కుస్తీ పహిల్వాన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నా చేతికి గాయం అయింది. ట్రెయిన్‌ అయిన ఫైటర్లను తీసుకురావాలని నేను చెప్పినా, బుచ్చిబాబు నిజమైన పహిల్వాన్‌లనే రంగంలోకి దించారు. యాక్షన్‌ సీన్స్‌లో వారు బలంగా పట్టుకోవడంతో నాకు గాయం అయ్యింది. చివరి పాట చిత్రీకరణకు సమయం చాలకపోయినా, జాన్వీ వెంటనే స్టెప్స్‌ నేర్చుకుని అద్భుతంగా చేసిందని తెలిపారు.

Advertisement