
హీరో సూర్యకు గొంతునందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక లేరు
ఈ వార్తాకథనం ఏంటి
పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం చెన్నైలో తన నివాసంలో కన్నుమూసారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్రీనివాస మూర్తి తుదిశ్వాస విడిచాడు.
1000కి పైగా సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు శ్రీనివాస మూర్తి. 1990లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, ప్రాణం పోయేంత చివరి వరకూ వాయిస్ అందిస్తూనే ఉన్నాడు.
ఎన్నో సినిమాలకు తన గొంతునిచ్చిన శ్రీనివాసమూర్తి, సూర్య సినిమాలతో బాగా గుర్తింపు పొందాడు. సూర్య నటించిన సింగం సిరీస్, 24 మొదలగు సినిమాల తెలుగు వెర్షన్లకు శ్రీనివాసరావు డబ్బింగ్ చెప్పాడు.
తమిళ హీరోలైన విక్రమ్, అజిత్ సినిమాలకు కూడా తన గొంతునిచ్చాడు శ్రీనివాస మూర్తి.
అపరిచితుడు సినిమాలో విక్రమ్ చేసిన మూడు క్యారెక్టర్లకి గొంతునిచ్చాడు మూర్తి.
తెలుగు చిత్ర పరిశ్రమ
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు వాయిస్ అందించిన శ్రీనివాస మూర్తి
తమిళ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాకు, జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు, అల వైకుంఠపురములో జయరాం పాత్రకు, ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ పాత్రకు గొంతునిచ్చాడు.
బాలీవుడ్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ల సినిమాల తెలుగు వెర్షన్లకు డబ్బింగ్ చెప్పాడు. రీసెంట్ గా ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన రాకెట్రీ నంబి ఎఫెక్ట్ సినిమాకు వాయిస్ ఇచ్చాడు.
హాలీవుడ్ చిత్రాల తెలుగు వెర్షన్లకు కూడా డబ్బింగ్ చేసాడు శ్రీనివాస మూర్తి. డబ్బింగ్ కాకుండా కొన్ని తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి నటించారు కూడా.
శ్రీనివాస మూర్తి కొడుకు పేరు ఏవీఎన్ మూర్తి. ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా పనిచేస్తున్నారు.