LOADING...
Dude: నవంబర్'లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్'కి రానున్న 'డ్యూడ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నవంబర్'లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్'కి రానున్న 'డ్యూడ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dude: నవంబర్'లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్'కి రానున్న 'డ్యూడ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'డ్యూడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రదీప్ రంగనాథన్ గత చిత్రం 'డ్రాగన్' భారీ విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'డ్యూడ్'పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సుమారు ₹25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన కొద్ది రోజులలోనే ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో, సీనియర్ నటుడు శరత్‌కుమార్ ముఖ్య పాత్ర పోషించారు.

వివరాలు 

నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు 

అలాగే హృదు హరూన్ కూడా ప్రాధాన్యమైన పాత్రలో కనిపించాడు. సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం యువత ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 'డ్యూడ్' నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రానున్నట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు డిజిటల్ హక్కులను పొందింది. కథ విషయానికొస్తే,గగన్ అనే యువకుడు తన మేనమామ కూతురు కుందనను ప్రేమిస్తాడు.అయితే తన తల్లితో మేనమామ మధ్య అనుబంధం లేకపోవడం వలన,తన ప్రేమను బయటపెట్టడానికి గగన్ వెనుకాడుతాడు. ఇదే సమయంలో, కుందన పార్థు అనే వ్యక్తితో దగ్గరవుతుంది. ఆమె మనసు పార్థు వైపు మళ్లడంతో గగన్ జీవితంలో ఎదురయ్యే మార్పులే సినిమా సారాంశం.