కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్ వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై దుల్కర్ సల్మాన్ స్పందించాడు కూడా. ఇటీవల కింగ్ ఆఫ్ కోత ప్రమోషన్స్ లో భాగంగా ఒకానొక ఇంటర్వ్యూలో కల్కి 2898 AD సినిమా గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడారు.
నిర్మాణ సంస్థకే తెలుసంటున్న దుల్కర్ సల్మాన్
కల్కి 2898 సినిమాలో మీరున్నారా అని యాంకర్ అడిగితే, కల్కి షూటింగ్స్ స్పాట్ కి తాను వెళ్లానని, కానీ ఆ సినిమాలో తాను ఉన్నానో లేదో తనకు తెలియదని, ఈ విషయం చిత్ర నిర్మాణ సంస్థకు మాత్రమే తెలుసని, వాళ్ళు మాత్రమే చెప్పగలరని దుల్కర్ సల్మాన్ అన్నారు. ప్రస్తుతం దుల్కర్ మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ మాటలు చూస్తుంటే కల్కి సినిమాలో తప్పకుండా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే కల్కి సినిమాకు మరింత మైలేజ్ వచ్చేసినట్టే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.