గన్స్ అండ్ గులాబ్ ట్రైలర్ విడుదల: ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల నుండి మరో సిరీస్
సీతారామం సినిమాతో తెలుగులో మంచి విజయం సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్ లు రూపొందించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. 1990ల ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ స్టర్ కథగా ఈ సిరీస్ ని రూపొందించినట్లు మేకర్స్ వెల్లడి చేసారు. ఈ సిరీస్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు ఆదర్ష్ గౌరవ్, గుల్షన్ దేవయ్య, రాజ్ కుమార్ రావు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆగస్టు 18నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది.