Dhurandhar 2: దురంధర్ 2 ప్రభంజనం.. భారతీయ చరిత్రలో తొలి మూవీగా సంచనల రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మూవీ ధురంధర్ ది రివెంజ్ భారీ సునామీ సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆథిత్యా థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లి, ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి వారం (8 రోజులు) ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1088 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాలు
ఇండియాలో కలెక్షన్ల జోరు
వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా అదే స్థాయి కలెక్షన్లను కొనసాగించడం విశేషంగా మారింది. తొలి వీకెండ్: ₹466 కోట్లు సోమవారం: ₹64 కోట్లు మంగళవారం: ₹58 కోట్లు బుధవారం: ₹49 కోట్లు గురువారం: ₹53 కోట్లు ఇలా మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.690 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.814 కోట్లను దాటాయి.
వివరాలు
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ప్రభంజనం
దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా 'ధురంధర్: ది రివెంజ్' దూసుకుపోతోంది. కేవలం వారం రోజుల్లోనే ఓవర్సీస్‌లో ₹274 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు ₹1088 కోట్లను దాటాయి. ఈ విజయానికి దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లింగ్ అంశాలు, అలాగే గతంలో వచ్చిన 'ధురంధర్' చిత్రానికి ఉన్న క్రేజ్ ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అత్యంత వేగంగా ₹1000 కోట్ల మైలురాయిని అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.