Eega : మళ్ళీ వెండితెరపై 'ఈగ' సందడి.. తమిళ దర్శకుడి సరికొత్త ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్రసీమలో చెక్కుచెదరని స్థానం సంపాదించిన స్టార్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'ఈగ' ఒకటి.
చిన్న ఈగతో గొప్ప సినిమా తీయగలనని ప్రూవ్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. అయితే ఈగ సీక్వెల్‌ను కోరుతున్న అభిమానుల ఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు.
'బాహుబలి' తర్వాత రాజమౌళి ప్యాన్ ఇండియా మార్కెట్‌లో మరింత పట్టు సాధించడంతో, ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా 'ఈగ' తరహాలోనే మరో సినిమా తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది.
Details
'లవ్లీ'గా ఈగ మరోసారి వెండితెరపైకి
'లవ్లీ' అనే సినిమా తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
మాథివ్ థామస్ హీరోగా, దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 4న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది.
ఇందులో ఓ ఈగ, యువకుడితో స్నేహం చేస్తుంది. అతనికి సలహాలు ఇచ్చి, అవసరమైనప్పుడు సహాయం చేస్తుంది. టీజర్ చూసిన ప్రేక్షకులు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా 'ఈగ' సినిమాను తలపిస్తున్నట్టు భావిస్తున్నారు.
అయితే ఇందులో విలన్ ఎవరు? హీరోయిన్ పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా విడుదల తర్వాతే స్పష్టమవుతాయి. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.