
ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.
ఆ తక్కువ మందిలో ఈషా రెబ్బా ఒకరు. ఈరోజు ఈషా బర్త్ డే. 2013లో రిలీజైన అంతకుముందు ఆ తరువాత చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా.
ఈ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి, ఫేస్ బుక్ లో ఈషాను చూసి సినిమాకు ఎంచుకున్నారట.
ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. హీరోయిన్ గా ఈషా రెబ్బాకు మంచి పేరొచ్చింది. కానీ ఆ తరువాత ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు.
Details
మామా మశ్చీంద్ర సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తున్న ఈషా
బందిపోటు తర్వాత 2017లో అమీతుమీ చిత్రంతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత మాయా మాల్, దర్శకుడు, వస్తా నీ వెనుక, అ!, బ్రాండ్ బాబు చిత్రాల్లో మెరిసింది ఈషా.
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోనూ ఈషా రెబ్బా కనిపించింది. కానీ ఆ పాత్ర పరిధి చిన్నది కావడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
రిలీజ్ కి సిద్ధమవుతున్న మామా మశ్చీంద్ర
ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హర్షవర్ధన్ తెరకెక్కించారు. మరి ఈ సినిమాతోనైనా ఈషా రెబ్బాకు సరైన హిట్ వస్తుందేమో చూడాలి.