This week telugu movie releases: ఈ వారం థియేటర్లలో ఎనిమిది సినిమాలు రిలీజ్.. ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్‌మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల డిసెంబర్ 12న టాలీవుడ్, కొలీవుడ్‌తో పాటు పలు ఇండిపెండెంట్ సినిమాలు, థ్రిల్లర్లు, బయోపిక్స్, లవ్ స్టోరీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ సందడి చేయబోతోంది. థియేటర్లలోకి వచ్చేసే సినిమాలు - డిసెంబర్ 12 రిలీజ్‌లు 'అన్నగారు వస్తారు' - కార్తి పోలీస్ అవతారం సమాజానికి అవసరమైనప్పుడల్లా 'అన్నగారిలా' వచ్చి నిలబడే నిజమైన హీరో కథను చూపించబోతుందీ చిత్రం. కార్తి పోలీసు అధికారిగా నటించగా, కృతిశెట్టి హీరోయిన్. యాక్షన్, కామెడీ కలగలిసిన ఈ ఫిల్మ్‌కు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 12న విడుదల.
Details
'సైక్ సిద్ధార్థ' - యువతకు కనెక్ట్ అయ్యే కథ
శ్రీనందు హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యామిని భాస్కర్ కథానాయిక. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. ప్రచార చిత్రాల ప్రకారం, సమాజం-యువత సమస్యలతో సన్నిహితంగా ముడిపడిన కథాంశం. 'మోగ్లీ 2025' - ప్రేమ కోసం యుద్ధం చేసే హీరో కథ "ప్రేమ కోసం పోరాడే ప్రతి వాడూ హీరోనే" అన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ లీడ్ జంట. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ కూడా డిసెంబర్ 12న ప్రేక్షకులను పలుకరించబోతోంది.
Details
'ఘంటసాల ది గ్రేట్' - మహాగాయకుడి జీవితం తెరపైకి
దర్శకుడు సి.హెచ్. రామారావు ఎంతో శ్రద్ధగా రూపొందించిన ఈ బయోపిక్‌లో కృష్ణచైతన్య ఘంటసాల పాత్రలో నటించారు. మృదుల, సుమన్, సాయికిరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 12న విడుదల. 'ఈషా' - హారర్ థ్రిల్లర్ అఖిల్ రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్‌కి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి కలిసి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న థియేటర్లలోకి. కథలో షాకింగ్ ఎలిమెంట్స్ అధికం అని టీమ్ చెబుతోంది.
Details
'మిస్ టీరియస్' - సస్పెన్స్ థ్రిల్లర్
రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన తారాగణంతో మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ కూడా డిసెంబర్ 12నే రానుంది. 'నా తెలుగోడు' - సామాజిక విషయాలతో హరినాథ్ పొలిచర్ల హీరోగా, దర్శక-నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రఘుబాబు, జరీనా వహాబ్, నైరా పాల్ కీలక పాత్రల్లో నటించారు. సమాజానికి ఉపయోగపడే అంశాలతో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల. 'ఇట్స్ ఓకే గురు'-అన్ని భావోద్వేగాలతో సాయి చరణ్, ఉషశ్రీ జంటగా మణికంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ప్రేమకథతో పాటు అనేక భావోద్వేగాలు ఉన్న ఈ సినిమా కూడా డిసెంబర్ 12న విడుదల కానుంది.
Details
ఈవారం ఓటీటీలో వస్తున్న సినిమాలివే
నెట్‌ఫ్లిక్స్ మ్యాన్ వర్సెస్ బేబీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 11 గుడ్‌బై జూన్ (మూవీ) డిసెంబరు 12 సింగిల్‌పాపా (హిందీ వెబ్‌సిరీస్) డిసెంబరు 12 వేక్ అప్ డెడ్ మ్యాన్ (మూవీ) డిసెంబరు 12 జియో హాట్‌స్టార్ సూపర్‌మ్యాన్ (మూవీ) డిసెంబరు 11 ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ (మూవీ) డిసెంబరు 1 ఆహా త్రీ రోజెస్ (తెలుగు సిరీస్) డిసెంబరు 12 అమెజాన్ ప్రైమ్ మెర్వ్ (మూవీ) డిసెంబరు 10 టెల్ మి సాఫ్టీ (మూవీ) డిసెంబరు 12