LOADING...
Jananayagan : తమిళ సినీ పరిశ్రమలో ఒక శకం ముగింపు.. స్టార్ హీరో సినిమాలకు గుడ్‌బై
తమిళ సినీ పరిశ్రమలో ఒక శకం ముగింపు.. స్టార్ హీరో సినిమాలకు గుడ్‌బై

Jananayagan : తమిళ సినీ పరిశ్రమలో ఒక శకం ముగింపు.. స్టార్ హీరో సినిమాలకు గుడ్‌బై

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ నటించిన చివరి చిత్రం 'జననాయగన్'. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్ర ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ గత రాత్రి మలేషియాలోని ఓపెన్‌ స్టేడియంలో అత్యంత ఘనంగా జరిగింది. దళపతి కెరీర్‌లో ఇది లాస్ట్‌ మూవీ కావడంతో, ఆడియో లాంచ్‌ను పండుగ వాతావరణంలో, ఫెస్టివల్‌ రేంజ్‌లో నిర్వహించారు మేకర్స్. భారీ స్టేజ్‌, ఇంటర్నేషనల్‌ లైటింగ్‌ డిజైన్‌, వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుక, విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఆడియో లాంచ్‌గా 'జననాయగన్' నిలిచింది.

Details

ప్రత్యేకంగా అభిమానుల కోసం 'దళపతి కచేరి' సాంగ్

ఈ ఈవెంట్‌లో అభిమానుల కోసం ప్రత్యేకంగా 'దళపతి కచేరి' సాంగ్‌కు డాన్స్‌ చేసి విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. పాలిటికల్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్‌ కెరీర్‌లో చివరి సినిమా కావడం విశేషం. ఈ సినిమా తర్వాత విజయ్‌ నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పి, ఫుల్‌ టైమ్‌ రాజకీయ నాయకుడిగా మారనున్నారు. ఇప్పటికే 'టీవీకే' పార్టీ పేరుతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్‌గా ఉన్న ఆయన, ఈ సినిమాతో సినిమాలకు స్వస్తి పలకబోతున్నారు. చాలా ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా అభిమానులను అలరించిన విజయ్‌ సినిమాల నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్‌ నిరాశలో మునిగిపోయారు.

Details

నటనకు వీడ్కోలు

ఆయన నటనకు వీడ్కోలు పలకడం కోలీవుడ్‌ చరిత్రలో ఒక స్టార్‌ హీరో శకం ముగిసినట్టుగా భావిస్తున్నారు. తమ అభిమాన హీరో చివరి సినిమాను ఘనంగా సెలబ్రేట్‌ చేయాలనే ఉద్దేశంతో అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న 'జననాయగన్' భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విజయ్

Advertisement