Loading...
Scene Movie: హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!
హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!

Scene Movie: హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్‌ కామెడీ చిత్రం 'సీన్‌' (Scene) తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా 'విక్రమ్‌' సినిమాలో కల్ట్ క్యారెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'రోలెక్స్‌' పాత్రపై ఆయన చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున 'రోలెక్స్‌.. రోలెక్స్‌' అంటూ నినాదాలు చేయడంతో సూర్య స్పందించారు. ఈ పాత్రకు సంబంధించి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతేకాదు.. ''చాలామంది హీరోలు వచ్చారు.. ఇప్పుడు ఓ బలమైన విలన్ కావాలంటూ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించారు.

వివరాలు

రోలెక్స్‌గా మళ్లీ కనిపిస్తారా? లోకేష్‌కు సూర్య పిలుపు!

వేడుకలో అభిమానుల నినాదాలతో ఆడిటోరియం మారుమోగుతున్న సమయంలో సూర్య నవ్వుతూ వారితో మాట్లాడారు. మీరంతా రోలెక్స్ గురించే అడుగుతున్నారని తనకు తెలుసని, ఈ విషయంపై ఇప్పటికే తెరవెనుక చాలా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

లోకీకి (లోకేష్ కనగరాజ్) చెప్పండి.. నాకు ఫోన్ చేయమని, వచ్చి నన్ను కలవమని చెప్పండి. కచ్చితంగా దాన్ని నిజం చేద్దాం'' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ''హీరో బెటరా? విలన్ బెటరా?'' అని ప్రశ్నించారు. దీంతో అభిమానులంతా ముక్తకంఠంతో విలన్ అంటూ కేకలు వేశారు.

దీనిపై సూర్య స్పందిస్తూ.. ''ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చేశారు. ఇప్పుడు మనకు ఓ సాలిడ్ విలన్ అవసరం ఉంది. ఆ పని కచ్చితంగా చేద్దాం'' అని హామీ ఇచ్చారు.

వివరాలు

నజ్రియా మూడుసార్లు నో చెప్పారు.. చివరకు ఓకే!

దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోలెక్స్ పాత్ర మరోసారి తెరపై కనిపిస్తుందనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి.

ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి కూడా సూర్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

10 నుంచి 12 ఏళ్లుగా ఎంతోమంది స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు ఆమెను తమ సినిమాల్లో నటించాలని సంప్రదించినప్పటికీ నజ్రియా అంగీకరించలేదని తెలిపారు.

తాము కూడా ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించగా.. మొదట మూడుసార్లు తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు.

అయితే నాలుగోసారి కథను వివరించగా నచ్చడంతో ఆమె నటించేందుకు అంగీకరించారని చెప్పారు. షూటింగ్ సమయంలో నజ్రియా చూపించిన ప్రిపరేషన్, అంకితభావం అద్భుతమని ప్రశంసించారు.

ADVERTISEMENT

వివరాలు

మర్డర్, మిస్టరీ, మ్యాడ్‌నెస్.. ఫుల్ లాఫ్టర్!

సినిమాలోని 'మాయ' పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందని కొనియాడారు. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ప్రతి షాట్‌కు ముందు ఆమెలో కనిపించే చిన్నపాటి నెర్వస్‌నెస్ ఆమె పనిపట్ల చూపించే నిజాయితీకి నిదర్శనమని సూర్య అభిప్రాయపడ్డారు.

'రోమాంచం', 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జిత్తు మాధవన్ ఈ సినిమాను విభిన్నమైన కథాంశంతో రూపొందించినట్లు సూర్య తెలిపారు.

మర్డర్, మిస్టరీ, మ్యాడ్‌నెస్‌తో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా సినిమాలో ఉంటుందని చెప్పారు.

యాక్షన్, వినోదం కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

తెలుగు ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటా!

ఈ ఏడాది ఇప్పటికే 'వీరభద్రుడు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాల తర్వాత మూడోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం తనకు ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం తమ పనులన్నీ పక్కనపెట్టి, గంటల తరబడి ఎదురుచూస్తూ ఈ వేడుకకు వచ్చిన తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదని భావోద్వేగానికి గురయ్యారు.

గతంలో తాను ఇంట్రోవర్ట్‌గా ఉండేవాడినని గుర్తు చేసుకున్న సూర్య.. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆత్మవిశ్వాసం ఉందని చెప్పారు.

ఎవరైనా తమను తాము నమ్ముకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని స్ఫూర్తినిచ్చారు. ''నేనే బెస్ట్.. నేను ఏదైనా చేయగలను'' అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు.

వివరాలు

నవంబర్ 6న థియేటర్లలోకి 'సీన్‌'!

దీపావళి సందర్భంగా నవంబర్ 6న 'సీన్‌' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రతి కుటుంబం కలిసి చూసి ఆస్వాదించేలా రూపొందించినట్లు సూర్య తెలిపారు.

బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తమకు అందించాలని కోరారు.

ఒకవైపు 'సీన్‌' సినిమాపై అంచనాలు పెరుగుతుండగా.. మరోవైపు రోలెక్స్ పాత్ర రీఎంట్రీపై సూర్య చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ADVERTISEMENT