Devara overseas deal: రికార్డు ధరకు 'దేవర' ఓవర్సీస్ రైట్స్
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది.
చిత్రీకరణ కూడా పూర్తి కాకపోముందు దేవర సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
'దేవర' ఓవర్సీస్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగిందని ఫిల్మ్ వర్గాలా టాక్.
తమిళ సినిమాలను పంపిణీ చేసే హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ 'దేవర' ఓవర్సీస్ హక్కులను రూ.27 కోట్లకు కొనుగోలు చేసిందని చెబుతున్నారు.
దేవర
6.5 మిలియన్ల డాలర్ల వసూళ్లు రాబడుతుందా?
ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ని సాధించాలంటే దేవర 6.5 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ గ్రాస్‌ను సాధించాలి.
అంటే, ఈ సినిమా సేఫ్ జోల్‌లో ఉండాలంటే.. ఒక్క యూఎస్‌లోనే 5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ.. దేవర 5 మిలియన్లకు పైగా వసూళ్లు రాబడితే.. కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.
దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు రెండు భాగాలుగా నిర్మిస్తున్నాయి.