Irumudi: 'ఇరుముడి' క్లైమాక్స్ చూసి చిన్నారులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు: రవితేజ
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవితేజ.. తన సినీ ప్రయాణం ఈ నగరంలోనే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. ''1990ల్లో చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం చెన్నైలోనే మొదలైంది. 'ఇరుముడి' సినిమాకు జీవీ ప్రకాశ్ హృదయం లాంటి వారు. ఎడిట్ రూమ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండానే సినిమాను చూసినప్పుడు.. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని అప్పుడే అర్థమైందని రవితేజ తెలిపారు. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా కదిలిస్తోందని ఆయన అన్నారు.
వివరాలు
రవితేజ నటనపై ప్రశంసలు
''క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్లలో మగవారితో పాటు చిన్నపిల్లలు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ సన్నివేశాలు నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని చెప్పారు.
ఇక కథానాయిక ప్రియా భవానీ శంకర్‌పై కూడా రవితేజ ప్రశంసలు కురిపించారు.
ఆమె గొప్ప నటి అని కొనియాడారు. తెలుగులో విజయాన్ని అందుకున్నట్లే తమిళంలోనూ 'ఇరుముడి' కచ్చితంగా సూపర్‌హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వివరాలు
వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి 'ఇరుముడి'
'ఇరుముడి'కి ఓవర్సీస్‌లోనూ మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని రికార్డు సృష్టించింది.
రవితేజ కెరీర్‌లో ఈ క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'ఇరుముడి' నిలిచింది.
ఇక మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో రవితేజ కెరీర్‌లో 'ఇరుముడి' మరో భారీ విజయంగా నిలిచింది.