Kara: 'ఆమె నటించదనుకున్నా'.. మమితా ఎంపికపై దర్శకుడు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
'పొర్ తొళిల్'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు విఘ్నేశ్ రాజా, ఇప్పుడు ధనుష్ హీరోగా తెరకెక్కించిన 'కర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఈ నెల 30న తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ ఎంపికపై విఘ్నేశ్ రాజా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదట ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా చైత్ర జె ఆచార్ను ఎంపిక చేసి, లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే శశికుమార్ నటిస్తున్న 'మై లార్డ్' సినిమాలో ఇదే తరహా లుక్‌లో కనిపిస్తున్నానని చెప్పిందన్నారు.
వివరాలు
ఈ సినిమాలో ఆమె పాత్ర పూర్తి భిన్నం
'కర' కంటే ముందే ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, రెండు సినిమాల్లో ఒకే లుక్ ఉంటే ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని భావించి, ఆ ఆప్షన్‌ను వదిలేసినట్లు చెప్పారు. ఆ తరువాత మమితా బైజును సంప్రదించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆమె ఎక్కువగా హుషారైన పాత్రల్లో నటించిందని,'కర'లోని పాత్ర మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఆమె అంగీకరించకపోవచ్చని భావించానని తెలిపారు. కానీ కథ విన్న వెంటనే మమితా నటించడానికి ఒప్పుకోవడంతో ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. సప్త సాగరాలు దాటి: సైడ్ బి, 3 బీహెచ్‌కే వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన చైత్ర, అలాగే ప్రేమలు, డ్యూడ్ సినిమాలతో గుర్తింపు పొందిన మమితా—ఈ ఇద్దరి ఎంపిక నేపథ్యంలో 'కర'పై ఆసక్తి మరింత పెరిగింది.