LOADING...
Dhurandhar 2 : 22.6%కి పడిపోయినా జోరు తగ్గలేదు.. రూ.1400 కోట్ల దిశగా 'ధురంధర్ 2'!
22.6%కి పడిపోయినా జోరు తగ్గలేదు.. రూ.1400 కోట్ల దిశగా 'ధురంధర్ 2'!

Dhurandhar 2 : 22.6%కి పడిపోయినా జోరు తగ్గలేదు.. రూ.1400 కోట్ల దిశగా 'ధురంధర్ 2'!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మూవీ రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా చేసిన వేట ఇంకా ఆగేలా కనిపించడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2: ది రివెంజ్' రెండో వారంలోనూ తన జోరును కొనసాగిస్తోంది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో వసూళ్లలో సహజమైన తగ్గుదల కనిపించినా మొత్తం మీద ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మాత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

వివరాలు

12వ రోజు వసూళ్ల రిపోర్ట్

రిలీజ్ అయిన 12వ రోజు (రెండో సోమవారం, మార్చి 30) 'ధురంధర్ 2' భారత బాక్సాఫీస్ వద్ద రూ. 25.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా ఈ సినిమా మొత్తం రూ. 872.17 కోట్ల నెట్ (రూ. 1,042.23 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను నమోదు చేసింది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మంచి వసూళ్లు రాబడుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ రూ. 1,392.23 కోట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు రూ. 1,400 కోట్ల మార్క్‌ను టచ్ చేసే దశలో ఉంది.

వివరాలు

వసూళ్లలో తగ్గుదల.. ట్రేడ్ విశ్లేషణ

రెండో ఆదివారం (మార్చి 29) రూ. 68.10 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సోమవారం నాటికి 62.8 శాతం తగ్గుదల నమోదు చేసింది. అయితే ట్రేడ్ నిపుణుల ప్రకారం, పెద్ద సినిమాలకు వీకెండ్ తర్వాత సోమవారం వసూళ్లు తగ్గడం సాధారణమే. ఆదివారం 48.5 శాతంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీ, సోమవారం 22.6 శాతానికి పడిపోయింది. అయినా దేశవ్యాప్తంగా 17,592 షోలతో సినిమా ప్రదర్శించబడుతుండటం గమనార్హం. ఇది ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని, ఎగ్జిబిటర్ల నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది

Advertisement

వివరాలు

రణ్‌వీర్ సింగ్ మ్యాజిక్ కొనసాగుతోంది

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పోషించిన గూఢచారి పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హుందాగా చేసిన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అందుకే చాలా మంది ఈ సినిమాను రెండోసారి, మూడోసారి కూడా చూస్తున్నారు. విదేశీ మార్కెట్లలో స్థిరంగా వసూళ్లు రావడం కూడా సినిమాకు ప్లస్‌గా మారింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే 'ధురంధర్ 2' విజయయాత్ర ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. రెండో వారం వర్కింగ్ డేస్‌లో నిలకడగా కొనసాగి, వచ్చే వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటే రూ. 1,500 కోట్ల మైలురాయిని సులభంగా దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement