LOADING...
Samantha: నా జీవితంలోని ప్రతి దెబ్బ.. అందరికీ తెలిసిందే : సమంత కీలక వ్యాఖ్యలు!
నా జీవితంలోని ప్రతి దెబ్బ.. అందరికీ తెలిసిందే : సమంత కీలక వ్యాఖ్యలు!

Samantha: నా జీవితంలోని ప్రతి దెబ్బ.. అందరికీ తెలిసిందే : సమంత కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ బ్యూటీ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ సవాళ్లను ఎప్పుడూ ప్రజల సమక్షంలోనే పంచుకున్నారు. నాగ చైతన్యతో విడాకులు తర్వాత మాయాసైటిస్ వ్యాధి కారణంగా చిక్కులకు లోనైన ఆమె, తాజాగా కోలుకుని తెరపై తిరిగి కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సమంత ఇటీవల యెన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొని, తన జీవిత విశేషాలు, సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన ప్రతీది ప్రజల ముందు జరిగిపోయింది. విడాకులు, హెల్త్ సమస్యలు—అన్ని నేను ఎదుర్కొన్న దెబ్బలు. ఆ సమయంలో నాకు చాలా ట్రోల్స్ ఎదురయ్యాయి, సోషల్ మీడియాలో జడ్జిమెంట్లు కూడా ఎదుర్కొన్నానని చెప్పింది.

Details

వచ్చే ఏడాది 'మా ఇంటి బంగారం' రిలీజ్

నేనెప్పుడూ పర్ఫెక్ట్ కాదని, తప్పులు చేశానని, దెబ్బలు తిన్నానని అంగీకరిస్తున్నా. ఇప్పుడు బెటర్ అయ్యానని వెల్లడించారు. సినిమాల విషయానికి వస్తే, సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో 'రక్త్ బ్రహ్మాండ్' సినిమాలో నటిస్తోంది. దీన్ని 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాలలో సమంత చేస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం', నందిని రెడ్డి దర్శకత్వంలో, వచ్చే ఏడాది విడుదల కానుంది. దీన్ని ఆమెకు భారీ ఫాలోయింగ్ ఇవ్వగల అవకాశంతో కూడిన సినిమా గా భావిస్తున్నారు. మొత్తంగా వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొని, కోలుకున్న సమంత ఇప్పుడు సినిమాల ద్వారా తన కెరీర్‌ను మళ్లీ పున:ప్రారంభించాలని చూస్తోంది.