Ram Charan Sukumar movie: 'RC17'పై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ నుంచి రిలీజ్ వరకు డెడ్‌లైన్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ 'RC17'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో 'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో 'RC17'పై యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ప్లానింగ్ నెట్టింట వైరల్ అవుతోంది
వివరాలు
విజయదశమికి 'RC17' పూజా కార్యక్రమాలు?
'RC17'ను ఈ ఏడాది అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా గ్రాండ్‌గా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దసరా పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించి.. అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించిన అనంతరం.. డిసెంబర్ నాటికి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దీంతో రామ్ చరణ్ అభిమానులు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
12 నెలల్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్
'RC17'ను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్, చిత్రబృందం ఒక నిర్దిష్ట గడువును నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.
సరిగ్గా 12 నెలల్లో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
అంటే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలో సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి.. 2027 డిసెంబర్ నాటికి చిత్రాన్ని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ఫైనల్ చేయలేదని సమాచారం. సంగీత దర్శకుడి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.