Page Loader
విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్
రేపు విడుదల కానున్న విరూపాక్ష మూవీ

విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష రేపు (ఏప్రిల్ 21) థియేటర్లలో విడుదల కానుంది. గాయం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్, టీజర్ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈసినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. 1970ల నుండి 1990ల మధ్య కాలంలో జరిగిన ఓ ఘటన ప్రేక్షకులను అలరిస్తుందని డైరక్టర్ అశాభావం వ్యక్తం చేశాడు.

details

విరూపాక్ష మూవీకి ఎ సర్టిఫికెట్

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ను ఇచ్చింది. US ప్రీమియర్ అమ్మకాలు బాక్సాఫీస్ వద్ద 35 వేల డాలర్ల వద్ద ఉన్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పొచ్చు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యుఎస్ ఓపెనింగ్‌ను నమోదు చేసే అవకాశాలు విరూపాక్షకు ఉన్నాయని బాక్సాఫీస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విరూపాక్ష చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.