Page Loader
Rashmika Mandannna : రష్మిక మంధాన డైలాగ్‌పై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
రష్మిక మంధాన డైలాగ్‌పై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

Rashmika Mandannna : రష్మిక మంధాన డైలాగ్‌పై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2023
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ క్రష్ రష్మికా మంధాన (Rashmika Mandannna) ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. తాజాగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మంధాన నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే రికార్డులను సృష్టించింది. ఇందులో హీరో రణబీర్ కపూర్ యాక్షన్, రష్మికా మంధాన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్‌లో 'చిన్నప్పటి నుంచి మీ నాన్న మీద పెంచుకున్నది అది ప్రేమ కాదు రోగం' అంటూ రష్మీ పళ్లీ బిగించి డైలగ్ చెబుతుంది. ఈ డైలాగ్‌కు వస్తున్న స్పందన గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు.

Details

ఎమోషనల్ సీన్ లో రష్మిక అద్భుతంగా నటించింది

రష్మిక మందన్న చాలా ఎమోషనల్ సీన్ కాబట్టి ఫలానా విధంగా మాట్లాడాలని ముందు అనుకున్నానని సందీప్ రెడ్డి చెప్పాడు. ఎవరైనా ఏదో ఒక ఎమోషన్‌కు గురైనప్పుడు పళ్లు బిగించి మాట్లాడతారని, దాన్ని అలాగే ఉంచామన్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌కు జోడీగా 'పుష్ప2'లో శ్రీ వల్లిగా రష్మిక అలరించనున్నారు.