
Fahad Faasil : ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన ఫహద్
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తన పాత్రకు సంబంధించిన పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సినిమాలో 'భన్వర్ సింగ్ షెకావత్' అనే విలన్ పాత్రలో ఫహద్ నటిస్తున్నారు.
మొదటి భాగంలో తక్కువ సమయమే కనిపించినా, రెండో భాగంలో ఎక్కువ సేపు కనిపించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫహద్ ఫజిల్ డబ్బింగ్ పూర్తవడంతో మరికొంత ముందడుగు పడింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్నారు.
Details
డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ముఖ్యమైన పాత్రల్లో ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్, శ్రీలీల తదితరులు కనిపించనున్నారు.
పుష్ప 2కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాకపోయినా, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఫహద్ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉండడం, అతని ప్రతిభ నెక్స్ట్ లెవెల్ అనిపించనుంది. 'పుష్ప ది రూల్' విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Embed
పోస్టు చేసిన ఫవాద్ ఫజిల్
Fahad Faasil completed dubbing for the #Pushpa2TheRule movie. pic.twitter.com/Q1jZfj2wQj— Telugu Chitraalu (@TeluguChitraalu) November 15, 2024