LOADING...
Sundarakanda OTT : ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఓటీటీలోకి వచ్చేసింది!
ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఓటీటీలోకి వచ్చేసింది!

Sundarakanda OTT : ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఓటీటీలోకి వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరాకాండ'తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా, సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపిస్తున్నారు. అతడు మ్యారేజ్ ఏజ్ దాటినా ఐదు ముఖ్యమైన లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతూ, తన మ్యాచును కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశం ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చింది.

Details

ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్

కొద్ది రోజులుగా అనేక వాయిదాల తర్వాత సుందరాకాండ ఆగస్టు 27న థియేటర్స్‌లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సత్య, నారా రోహిత్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిజిటల్ రైట్స్ రిలీజ్‌కి ముందే మంచి ధర పలికాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారం హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్‌ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత, ఈ రోజు నుండి హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. క్లీన్ కామెడీ, చక్కటి కథాంశం, సింప్ల్ మ్యూజిక్ కలిగిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.