తదుపరి వార్తా కథనం
Family Star: ఫ్యామిలీ స్టార్ గురించి అప్‌డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 01, 2024
03:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో,డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం ఏప్రిల్ 5,థియేటర్లలో విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు నటుడు తన సోషల్ మీడియాలో ప్రకటించాడు.
టీజర్ విడుదల తేదీని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయమై త్వరలో ప్రకటన వెలువడనుంది.
ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్
Teaser వస్తుంది / வந்திட்டுருக்கு :)
— Vijay Deverakonda (@TheDeverakonda) March 1, 2024