
Sriram : ఘోర అగ్నిప్రమాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీరామ్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అలియాస్ శ్రీరామ్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో అర్థం కావడం లేదు.
తాజాగా శ్రీరామ్ నిద్రిస్తున్న గదిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గదిలోని ఏసీ ఔట్‌డోర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అవి ఒక్కసారిగా గదిలోకి ప్రబలడంతో దట్టమైన పొగ మొత్తం గది అంతా వ్యాపించింది.
ఈ పొగలో ఊపిరాడక శ్రీరామ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో గదిలో ఇరుక్కుపోయిన ఆయనను బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారు.
అయినా వారికీ ఆయనను బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
తీవ్రమైన పొగవల్ల ఊపిరాడక ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో శ్రీరామ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.