LOADING...
Lip Kiss Incident : స్టేజ్‌పై హద్దులు దాటిన ఫ్యాన్.. స్టార్ హీరోయిన్‌కు బలవంతపు కిస్!
స్టేజ్‌పై హద్దులు దాటిన ఫ్యాన్.. స్టార్ హీరోయిన్‌కు బలవంతపు కిస్!

Lip Kiss Incident : స్టేజ్‌పై హద్దులు దాటిన ఫ్యాన్.. స్టార్ హీరోయిన్‌కు బలవంతపు కిస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు కేరళలో అనూహ్యమైన సంఘటన ఎదురైంది. అభిమానుల ప్రేమ ఎంతగా ఉంటుందో చూపించిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని పాలక్కాడ్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంజు వారియర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఒక మహిళా అభిమాని స్టేజ్ వద్దకు చేరుకుని ఆమెను కలిసింది. అయితే ఉత్సాహంలో హద్దులు దాటి, మంజును గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ అకస్మాత్తు ఘటనతో మంజు వారియర్ కాసేపు షాక్‌కు గురయ్యారు.

వివరాలు

అభిమానంతో చేశాను తప్ప వేరే ఉద్ధేశం లేదు

వెంటనే పరిస్థితిని గమనించిన యాంకర్ జోక్యం చేసుకుని, బహిరంగ వేదికపై సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఆ మహిళను మందలించారు. దీనికి స్పందించిన ఆ అభిమాని, "నాకు మంజు అక్క అంటే ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే ఇలా చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా అసహనం కలగడం సహజం. కానీ మంజు వారియర్ మాత్రం ఎంతో హుందాగా స్పందించారు. క్షణిక అసౌకర్యం ఎదురైనా, ఎలాంటి కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ఆ అభిమానిని పలకరించారు. అనంతరం మిగతా అభిమానులతో సాధారణంగా సెల్ఫీలు దిగుతూ తన సింప్లిసిటీ, మంచితనాన్ని మరోసారి నిరూపించారు. ఈఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

Advertisement