Page Loader
ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి వచ్చిన రజనీకాంత్, ఫోటోలు వైరల్
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తున్న రజనీకాంత్

ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి వచ్చిన రజనీకాంత్, ఫోటోలు వైరల్

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 17, 2023
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడడానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ వెళ్ళారు. ఈ మేరకు మ్యాచ్ చూస్తున్న రజనీకాంత్ ఫోటోలను ముంబై క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, మైదానంలో తలైవా అని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ అమోల్ కాలే తో మాట్లాడుతూ మ్యాచ్ ని చూస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అదలా ఉంచితే, ఈ వన్డేలో 188పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తలా 3వికెట్లు, రవీంద్ర జడేజా 2వికెట్లు, కుల్దీప్, హార్దిక్ పాండ్యాలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై వాంఖడే స్టేడియంలో రజనీకాంత్