LOADING...
Samantha: స్టేజ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్.. సమంత రియాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!
స్టేజ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్.. సమంత రియాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

Samantha: స్టేజ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్.. సమంత రియాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత రూత్ ప్రభు, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మా ఇంటి బంగారం' అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో సమంత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం (మే 25) నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేశారు. అయితే ట్రైలర్ లాంచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు

అభిమానితో నవ్వుతూ సెల్ఫీ దిగిన సమంత

ఈవెంట్‌లో సమంత భర్త రాజ్ నిడిమోరు స్టేజ్‌పై మాట్లాడుతుండగా, ఒక్కసారిగా ఓ అభిమాని స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చుని సమంతకు పూలతో ప్రపోజ్ చేశాడు. ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రాజ్ నిడిమోరు మాట్లాడటం ఆపేయగా, పక్కనే ఉన్న యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందినీ రెడ్డి కూడా కంగారు పడ్డారు. అభిమాని ఒక్కసారిగా స్టేజ్‌పైకి రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఫ్యాన్ సమంతతో ఒక సెల్ఫీ కావాలని కోరడంతో ఆమె వెంటనే అంగీకరించింది. అభిమానితో నవ్వుతూ సెల్ఫీ దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాలు

సమంత మనసు కూడా బంగారమే అంటూ కామెంట్స్

ఈ ఘటనపై అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. "సినిమా టైటిల్ మాత్రమే కాదు.. సమంత మనసు కూడా బంగారమే" అంటూ కామెంట్లు పెడుతున్నారు. స్టేజ్‌పైకి వచ్చిన అభిమానితో ఎంతో సింపుల్‌గా మాట్లాడి, సెల్ఫీ ఇవ్వడం సమంత గొప్పతనమని ప్రశంసిస్తున్నారు. ఇదే ఈవెంట్‌లో ఓ వయసైన బామ్మతో కూడా సమంత ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత, గత కొంతకాలంగా నేరుగా తెలుగు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో కనిపించలేదు.

Advertisement

వివరాలు

జూన్ 19న మూవీ రిలీజ్

ఇప్పుడు 'మా ఇంటి బంగారం' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయానికి వస్తే.. 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తర్వాత వాయిదా వేశారు. ఐపీఎల్ 2026 కారణంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు సమాచారం.

Advertisement