Page Loader
దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్
ఇతర భాషల్లో దూసుకుపోతున్న దసరా ట్రైలర్

దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 16, 2023
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాపై అటు అభిమానుల్లోనే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తి ఎక్కువగా ఉంది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, ఇంకా ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రమోషన్లు చేస్తుండడంతో దసరా మీద ఆసక్తి ఎక్కువైంది. ఈ ఆసక్తిని దసరా ట్రైలర్ మరింత పెంచిందనే చెప్పాలి. ట్రైలర్ లో నాని కనిపించిన తీరు చూసి దాదాపుగా ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా సినిమాలు చేసే నాని, ఈసారి సినిమాలో రక్తపాతాన్ని సృష్టించాడు. అయినా కూడా అందరూ నాని ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ దసరా ట్రైలర్ కు ఆదరణ పెరుగుతోంది.

దసరా ట్రైలర్

హిందీ, మళయాలం, తమిళంలో దూసుకుపోతున్న దసరా ట్రైలర్

జనరల్ గా దసరా సినిమాపై తెలుగు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇతర భాషల వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ అంటుకుంది. ఆ విషయం ట్రైలర్ కు వస్తున్న వ్యూస్ చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పటివరకు దసరా ట్రైలర్ 10మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, హిందీలో 7మిలియన్లకు దగ్గరగా, మళయాలంలో 3మిలియన్లకు దగ్గరగా, తమిళంలో 2మిలియన్లకు దగ్గరగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఆల్రెడీ 20 మిలియన్లు పూర్తి చేసుకుంది. నాని కెరీర్ లో ఒక సినిమా ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి. మొత్తానికి నాని నటించిన దసరా సినిమాకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. మార్చ్ 30న సినిమా రిలీజ్ అవుతుంది.