Ram Charan: మెగా ఇంట పండగ వాతావరణం.. రామ్‌చరణ్ దంపతులకు కవల పిల్లలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 01, 2026
09:25 am
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఉపాసన ఓ మగ, ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) వెల్లడించారు. తల్లీబిడ్డలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం అపారమైన సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కవలల జననం నేపథ్యంలో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ శుభవార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.